KNR: పెండింగ్లో ఉన్న రూ. 9,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ బైపాస్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. బడ్జెట్లో విద్యకు కేవలం 8 శాతం కేటాయించడం అన్యాయమని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.