NGKL: వెల్దండ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపు ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సింధు తెలిపారు. ఈ శిబిరంలో వ్యాధులు, ఎముకలు, కంటి, దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.