సత్యసాయి: శెట్టి బలిజల పితామహుడు, గొప్ప సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి అని మంత్రి ఎస్. సవిత అన్నారు. ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం గర్వంగా ఉందని అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ తన వంతు పాత్ర పోషించారన్నారు.