RR: కొత్తూరు సమీపంలోని ఐఓసీ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారును లారీ అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ముగ్గురు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంతో ట్రాఫిక్ నిలిచిపోగా.. పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.