NTR: విజయవాడలో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ను కలెక్టర్ లక్ష్మీశా ఆదివారం సందర్శించారు. PNG వినియోగం సురక్షితమైనదిగా, సౌకర్యవంతమైనదని కలెక్టర్ అన్నారు. భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు పర్యావరణానికి అనుకూలమైన PNG వినియోగం వైపు మళ్లాలని సూచించారు. జిల్లాలో PNG కనెక్షన్ల విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.