KRNL: పెద్దకడబూరు మండలంలోని గవిగట్టు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నేతలు సోమవారం భూమిపూజ చేశారు. టీడీపీ నాయకులు ఉప్పర బసయ్య, మునిస్వామి, ఈరన్న, హనుమంతు, దాసప్ప, బజారి, బంగారయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలకు మహర్ధశ వచ్చిందన్నారు.