W.G: ఆచంట, పెనుగొండ మండలాల మీదుగా ప్రవహించే కొటాలపర్రు మురుగు డ్రైన్ ప్రస్తుతం పూడికలతో నిండిపోయింది. డ్రైన్లో మట్టి దిబ్బలు పేరుకుపోయి, పిచ్చి మొక్కలు పెరగడంతో నీటి ప్రవాహం ఆగిపోయిందని రైతులు చెబుతున్నారు. స్వల్ప వర్షానికే డ్రైన్ పొంగి మురుగునీరు పొలాల్లోకి చేరడంతో పంటలు దెబ్బతిన్నాయన్నారు. వేసవి కాలం కావడంతో ఇప్పుడే పూడికలు తీయాలని కోరుతున్నారు.