భారత జట్టు వచ్చే ఏడాది జనవరి-మార్చిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌ల ‘బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ’ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న తమ 2026-27 క్యాలెండర్‌ను ప్రకటించింది. ఇందులో BGT కూడా ఉండగా.. పూర్తి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. డిసెంబర్-మార్చిలో ఆసీస్ బిజీబిజీగా ఉండనుంది. 14 వారాల్లో మొత్తం 10 టెస్ట్‌లు ఆడనుంది.