MDK: మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన తల్లి కూతుర్లు అదృశ్యమైనట్లు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ముక్క స్రవంతి(25), ఏడాది వయసున్న కూతురుతో కలిసి ఈనెల 18న ఇంట్లోంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయినట్లు ఎస్సై వివరించారు. భర్త ముక్క నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.