NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్‌గా అవకాశం కల్పించినందుకు గాను ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు ఆయనను సత్కరించారు.