WNP: ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి పురపాలికల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ రెవెన్యూ మేళ మార్చి 20 నుంచి మార్చి 31 వరకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకుని పురపాలిక అభివృద్ధికి సహకరించాలని కోరారు.