MBNR: మిడ్జిల్ మండలం వెలుగోముల గ్రామంలో ఈనెల 27న శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఆదివారం సర్పంచ్ సువర్ణమ్మ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. కళ్యాణం, అన్నదాన ఖర్చులను కటికి నిరంజన్ భరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.