AP: TTD ఛైర్మన్ పదవి నుంచి BR నాయుడిని తీసేస్తే కూటమి ప్రభుత్వ రహస్యాలు బయటపడిపోతాయని CM చంద్రబాబు వెనకాడుతున్నారని భూమన పేర్కొన్నారు. మింగలేక-కక్కలేక అన్నట్లుగా బాబు పరిస్థితి ఉంటే.. అవమానాల మధ్య ఉండలేక, పదవి విడిచి వెళ్లలేని స్థితిలో BR నాయుడు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇలా ఇద్దరూ దొందు దొండేనని, స్వామి ద్రోహులేనని విమర్శించారు.