VZM: బొబ్బిలి మండలం పారాది గ్రామ సమీపంలో ఇవాళ లోడు కంటైనర్ లారీ బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి సంబల్ పుర్ వైపు వెళ్తున్న ఈ కంటైనర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించుకునే క్రమంలో అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు తగిలాయి. అయితే ప్రాణాపాయం ఏదీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.