»Virat Kohli Who Created History Sachins Record Break
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..సచిన్ రికార్డ్ బ్రేక్
ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరుపై ఉండేది. ఈ జాబితాలో రోహిత్ శర్మ మూడోస్థానంలో ఉన్నాడు.
వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. మ్యాచ్‌లో కోహ్లీ 85 పరుగులతో విజృంభించాడు. దీంతో ఐసీసీ టోర్నీల్లో చూస్తే అటు వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచకప్, ఇటు ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ నెలకొల్పాడు.
ఇది వరకూ ఈ రికార్డు మాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరుపై ఉండేది. ఐసీసీ టోర్నీల్లో సచిన్ 58 మ్యాచుల్లో 2,719 పరుగులు చేశారు. అయితే ఇప్పటి వరకు కోహ్లీ 64 మ్యాచులు ఆడి 2,785 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. వీరిద్దరి తరువాత 2,422 పరుగులతో కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత యువరాజ్ సింగ్, గంగూలీలు ఆ జాబితాలో ఉన్నారు.