SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలో డిజిటల్ చెల్లింపుల పేరిట మోసానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మెడికల్ షాపులో రూ.400 విలువైన మందులు కొనుగోలు చేసిన సదరు వ్యక్తి, ఫోన్ పే ద్వారా నగదు పంపినట్లు నకిలీ స్క్రీన్ షాట్ చూపించాడు. అయితే యజమాని కుమార్ ఖాతాలోకి నగదు జమ కాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.