ATP: కళ్యాణదుర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో కన్నుమూశారు. యర్రంపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. హనుమంతరాయ చౌదరి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.