సీఎం కేసీఆర్ ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌కు చికిత్స జరుగుతోందని, కోలుకోవడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణ (Telangan) సీఎం కేసీఆర్ (CM KCR) గత మూడు వారాలుగా వైరల్ ఫీవర్ (Viral Fever)తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరింత అనారోగ్యానికి గురయ్యారు. గులాబీ బాస్‌కు ఛాతిలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. జాతీయ మీడియాతో కేటీఆర్ (KTR) మాట్లాడుతూ..కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారన్నారు.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (Bacterial Infection) రావడం వల్ల ఆయన కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, కార్యకర్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణలో అల్పాహార పథకం ప్రారంభం కావాల్సి ఉంది. అియతే ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల మంత్రులు చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభమైంది.
సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్ (Viral Fever) నుంచి కోలుకున్నాక ఇప్పటికే ఓసారి వాయిదా పడిన కేబినెట్ భేటీ అక్టోబర్ మొదటి వారంలో అయిన లేకుంటే రెండో వారంలో అయినా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసీఆర్‌కు ప్రగతి భవన్ లోనే చికిత్స జరుగుతోంది. యశోద ఆస్పత్రి నుంచి వచ్చిన ఐదుగురు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స చేస్తున్నారు.
కేసీఆర్ కోలుకోవడానికి ఇంకా వారం రోజులు ఉందని, మరో ఇద్దరు నిపుణులు కూడా దగ్గరుండి కేసీఆర్ (CM KCR) ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారని తెలుస్తోంది. కేసీఆర్ కోలుకోవడానికి ఇంకో వారం రోజులు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.