KNR: మత సామరస్యానికి రంజాన్ ప్రతీకని, ముస్లింల పవిత్ర మాసంలో జరుపుకునే రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీక అని టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఈద్ – ఉల్ – ఫితర్ రంజాన్ సందర్భంగా ఆయన మానకొండూర్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులను కలిసి అలయ్ బలయ్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.