KNR: రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సాధికారతే అత్యంత కీలకమని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వివో భవనం పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళా సాధికారతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు.