Stuck In Lift: అప్పుడప్పుడు కొన్ని లిప్ట్స్ ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని కొన్నింటికీ ఇనుప గ్రిల్స్ ఉంటాయి. మరికొన్ని మాత్రం క్లోజ్ అయి ఉంటాయి. సో.. అలాంటి వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో లిప్ట్ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ వీడియోలు మనం చూశాం.. ఇప్పుడు ఓ చిన్నారి (Child) లిప్ట్‌లో ఇరుక్కొని ఇబ్బంది పడింది. ఆ వీడియో ఓ సారి చూడండి.
లక్నోలో (lucknow) ఈ ఘటన జరిగింది. జనేశ్వర్ ఎంక్లేవ్ అపార్ట్ మెంట్ లిప్ట్‌లో ఓ చిన్నారి ఇరుక్కుంది. ఆ పాప వయస్సు 8 ఏళ్ల వరకు ఉంటాయి. టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది.. కావచ్చు. చిన్నారి మాత్రం భయపడింది. వెంటనే బెల్ కొడితే బాగుండేది.. కానీ అలా చేయలేదు. భయ పడి.. గంతులేసింది. లిప్ట్ డోర్ తీసేందుకు తెగ ట్రై చేసింది. 2.09 నిమిషాల వీడియోలో ఆ చిన్నారి పడిన టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. భయ్యా అంటూ పిలిచింది. దేవుడా.. తనను కాపాడాలని కోరింది.
లిప్ట్‌లో ఇరుక్కొని ఉంటే పెద్దలే కంగారు పడతారు. ఇక పిల్లల సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఆ చిన్నారి మాత్రం తెగ కంగారు పడింది. వెంటనే సాయం చేయకపోవడం.. ఎవరూ స్పందించలేదు. ఆ చిన్నారి పడిన టెన్షన్ అంతా సీసీటీవీలో రికార్డైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వామ్మో.. చిన్నారి ఎంత కష్టం వచ్చింది.. అన్నారు. యూఆర్ బ్రేవ్ చైల్ట్ అని మరొకరు రాశారు. ఆ చిన్నారి చాలా భయపడిందని.. అలాంటి కష్టం మరొకరికి రావొద్దని అభిప్రాయ పడ్డారు. ప్లాట్ మెయింటనెన్స్ టీమ్ ఏమయ్యిందని.. వారు ఏరీ అని మరొకరు కామెంట్ చేశారు.