MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను కట్టని యజమానులకు అధికారులు రెడ్ నోటీస్ జారీ చేశారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది శనివారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో ప్రజలు, వ్యాపారుల నుండి వివిధ పన్నులను వసూలు చేస్తున్నారు. పన్నులు కట్టని వారికి అధికారులు నోటీసులు ఇస్తున్నారు.