WGL: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్నలో తేమ శాతం 14% మించకుండా చూసుకోవాలని ఆమె సూచించారు. క్వింటాకు రూ. 2,400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. రైతులు దళారులను ఆశ్రయించి మెసపోవద్దని పేర్కొన్నారు.