SDPT: హుస్నాబాద్‌లో ముస్లింలు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే స్థానిక మసీదులకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ముస్లింలు ఆనందంగా వేడుకలను జరుపుకున్నారు.