NDL: రంజాన్ వేడుకలను జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు నెల రోజులపాటు ఉపవాసం ఉండి ఈద్గాలో సామూహిక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షను విరమించారు. పట్టణంలోని కర్నూలు రోడ్డులో గల ఈద్గా వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.