AKP: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలని పశువైద్య అధికారిణి డాక్టర్ కె.రాఘవమ్మ సూచించారు. శుక్రవారం చీడికాడ మండలం బైలపూడిలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేశారు. పాడి పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని అన్నారు.పెయ్యిలకు సోకితే మరణాలు సంభవిస్తాయన్నారు.