AP: విశాఖ కాకానినగర్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య ఆటో ఇరుక్కొని బోల్తాపడింది. ముగ్గిరికి తీవ్రగాయాలు కాగా, లారీ కిందిభాగంలో మహిళ చిక్కుకున్నది. NAD కొత్త రోడ్డు పైవంతెన వద్ద వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో ఎయిర్పోర్టు జోన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మహిళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు.