గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖలో ‘మిషన్ వాత్సల్య’ కింద కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కౌన్సిలర్, మేనేజర్, స్టోర్ కీపర్, హెల్పర్, పీటీ, యోగా టీచర్ వంటి ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23 నుంచి 31 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు guntur.ap.gov.in వెబ్ సైట్ను సంప్రదించండి.