MBNR: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు పూర్తిగా నిషేధించాలన్నారు. కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.