ప్రకాశం: పొదిలి మండలం మల్లవరం గ్రామ పంచాయతీ, కొష్టాలపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వర్షం ధాటికి పొగాకు పంట మొత్తం చెల్లాచెదురై నేలకొరిగింది. దీంతో రైతు నడికట్టు సుబ్బారెడ్డి సుమారు రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని లబోదిబో మంటున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.