SKLM: కవిటి మండలంలోని అన్ని గ్రామాలకు శనివారం, ఆదివారం నీటి సరఫరా నిలిచిపోతుందని ఎంపీడీవో ఎల్. త్రినాథ్ తెలిపారు. హిరమండలం హెడ్‌వర్క్స్ వద్ద ఉద్దానం పైపులైన్‌కు సంబంధించి ఇరిగేషన్ క్రాసింగ్ పనులు నిర్వహించనున్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. నీటి సరఫరా నిలిపివేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కవిటి మండల ప్రజలు సహకరించాలన్నారు.