E.G: నల్లజర్ల RTC బస్టాండ్ వద్ద శుక్రవారం సామాజికవేత్త మల్లిపూడి రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో MLA మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80 మంది ద్విచక్ర వాహనదారులకు ఆయన ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి వాహనదారుడు బాధ్యతగా హెల్మెంట్ ధరించి వాహనం నడపాలని ఎమ్మెల్యే సూచించారు.