VZM: ఒడిసా ప్రైవేట్ బస్సు రామభద్రపురం సమీపంలో శనివారం తెల్లవారుజామున పూర్తిగా దగ్ధమయ్యింది. బస్సు డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ నుంచి బయదేరిన బస్సు రామభద్రపురం వచ్చే సరికి వెనుక టైరుకు మంటలు మొదలై బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులకు కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.