BDK: ముస్లిం సోదర, సోదరీమణులకు ఎస్పీ రోహిత్ రాజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలందరూ సోదర భావాన్ని కలిగి ఉండాలి అన్నారు. ముస్లింలు ఈ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో ముస్లింలు చేసిన కఠిన ఉపవాస దీక్షలను ఈద్-ఉల్-ఫితర్ పండుగతో ముగిస్తారని అన్నారు.