KKD: కాకినాడ, పెద్దాపురం డివిజన్ పరిధిలో అన్ని మండలాలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారనే సమాచారంతో RDO మల్లిబాబు, తహసీల్దారులతో తనిఖీలు నిర్వహించారు. 140 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. RDO మాట్లాడుతూ వారిపై కేసు నమోదు చేసి అత్యవసర వస్తువుల చట్టం సెక్షన్ 6A కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.