రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్ 2’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమాపై కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘నాకు ధురంధర్ 2 ఏ మాత్రం నచ్చలేదు. అదొక పరమ చెత్త సినిమా. మూవీ చూస్తూ థియేటర్లోనే నిద్రపోయాను’ అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.