NZB: ఆలూర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ఇంట్లోని బీరువాలను పగులగొట్టి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.