మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుక్రవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండారి శ్రీనివాస్ గౌడ్ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలకు పండ్లు, ఖర్జూరాలు అందజేసి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక అని కొనియాడారు.