యూపీ బీజేపీ ఎమ్మెల్యే అధికారిక నివాసంలో పనిచేసే సిబ్బందిలోని ఓ యువకుడు ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. ప్రియురాలితో గొడవ పడి అతను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లో చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే యోగేశ్ శుక్లా (MLA Yogesh Shukla) మీడియా సెల్లో శ్రేష్ఠ తివారీ అనే 24 ఏళ్ల యువకుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. తివారీ నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో లవ్(Love)లో ఉన్నాడు.
ఈ క్రమంలో వారిద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్డారు. విధుల్లో భాగంగా ఎమ్మెల్యే అధికార నివాసంలో ఉన్నప్పుడు తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆమెతో మాట్లాడుతూ ఉరి వేసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు (Police) తలుపులు పగలగొట్టి చూడగా.. యువకుడు విగత జీవిగా పడి ఉన్నాడు. ప్రియురాలి ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.