CTR: వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నిత్య అన్నదానం ట్రస్ట్‌కు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన సుజాత, వారి కుటుంబ సభ్యులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి పాల్గొన్నారు.