VSP: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 23వ తేదీన విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం వాయు మార్గం ద్వారా విశాఖ చేరుకుని, అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, అనంతరం తిరిగి వాయు మార్గం ద్వారా విజయవాడకు వెళ్లనున్నారు.