VSP: వైసీపీ విశాఖపార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం, వ్యవస్థీకరణపై సమావేశం నిర్వహించారు. డిజిటల్ ప్రాతిపదికన పార్టీ కమిటీల ఏర్పాటు చేసి సభ్యుల వివరాలతో సమగ్ర డేటాబేస్ రూపొందించాలని నిర్ణయించారు. ఈ వివరాలను నిర్ణీత గడువులో జిల్లా కార్యాలయానికి సమర్పించి, అనంతరం కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు.