ELR: నూజివీడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం అందటంతో పట్టణ సీఐ పీ.సత్య శ్రీనివాస్ ఆదేశం మేరకు పట్టణ ఎస్సై కే.నాగేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.