చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేష్ వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. మరో వైపు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులను అచ్చెన్నాయుడు ప్రకటించారు. జనసేన నాయకులతో నారా బ్రహ్మాణి చర్చలు జరుపుతోంది. రాష్ట్రం వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలను టీడీపీ నేతలు చేపడుతున్నారు.
ఓ వైపు చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది. తాగా టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం జరిగింది. 14 మంది సభ్యులతో ఈ కమిటీ నియామకం చేపట్టారు. చంద్రబాబు ఆదేశాలతో అచ్చెన్నాయుడు ఈ కమిటీ సభ్యుల పేర్లను ఆదివారం విడుదల చేశారు.
ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయంగా టీడీపీ ముందుకు వెళ్లేందుకు ఈ కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ఈ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
నారా లోకేష్ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో చర్చలు సాగిస్తున్నారు. నారా బ్రాహ్మణి కూడా జనసేత నేతలతో చర్చల్లో పాల్గొంది. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేయడానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే నారా లోకేష్ యువగళం పాదయాత్రను చేపట్టనున్నారు.