స్కిల్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి కార్లతో ఐటీ ఉద్యోగులు ర్యాలీ తీస్తున్నారు. ఏపీ సరిహద్దు వద్ద భారీగా పోలీసులను మొహరించారు. విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదని సీపీ స్పష్టంచేశారు.
AP Border Police Force Sealed: స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు (chandrababu) అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ రోజు ఐటీ ఉద్యోగులు ర్యాలీ (rally) తీస్తున్నారు. హైదరాబాద్ నుంచి కార్లలో రాజమండ్రికి బయల్దేరారు. విజయవాడలో ఆంక్షలు అమల్లో ఉంటాయని, కార్ల ర్యాలీకి అనుమతి లేదని సీపీ నిన్ననే స్పష్టంచేశారు. దీనిని టీడీపీ ఖండించింది. ఇదీ ఏపీ సరిహద్దు అని.. పాకిస్థాన్ బోర్డర్ కాదంటూ మండిపడ్డారు.
ఐటీ ఉద్యోగుల ర్యాలీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గరికపాడు వద్ద శనివారం రాత్రి భారీగా పోలీసులను మొహరించారు. సరిహద్దు గుండా వచ్చే వాహనాలను తనిఖీ చేసిన తర్వాత ఏపీలోకి అనుమతి ఇస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రి వస్తోన్న ఐటీ ఉద్యోగులకు ఏపీలోకి అడుగు పెట్టే అర్హత లేద అని టీడీపీ మండిపడింది.
వందలాదిమంది పోలీసులను దింపి.. తాడేపల్లి ప్యాలెస్‌లో పిల్లి భయపడుతూ పడుకుందని ట్వీట్ చేసింది. ఇది ఏం పాకిస్థాన్ బోర్డర్ కాదు.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అని వీడియో షేర్ చేసింది. సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. స్కిల్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీఐడీ అధికారులు ఈ రోజు విచారించనున్నారు. నిన్న 50 ప్రశ్నలు వేశారు. ముందుగా ప్రిపేర్ చేసిన మరో 70 ప్రశ్నలను ఈ రోజు వేసే అవకాశం ఉంది.
ఐటీ ఉద్యోగులు తలపెట్టిన చలో రాజమండ్రి దృష్ట్యా పోలీసుల ఆంక్షలు
చంద్రబాబు అరెస్టుకు సంఘీభావంగా చలో రాజమండ్రి కి పిలుపునిచ్చిన ఐటి ఉద్యోగులు
తెలంగాణ – ఏపీ సరిహద్దులో భారీగా ఏపీ పోలీసు బందోబస్తు
గరికపాడు, అనుమంచిపల్లి వద్ద పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు