స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్టుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు(Karumuri Venkata Nageswara Rao) ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం అరెస్టు అయ్యారని ఈ మేరకు గుర్తు చేశారు.
Minister Karumuri Venkata Nageswara Rao Pawan failed to question the TDP scam
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్ట్‌పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మౌనం వహించడాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు(Karumuri Venkata Nageswara Rao) తప్పుపట్టారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడిన క్రమంలో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ అవినీతికి పాల్పడ్డారని స్వయంగా పవన్ కల్యాణ్ ఆరోపించారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు జేఎస్పీ నేత(pawan kalyan) మాత్రం ఈ స్కాం విషయంలో మౌనం వహిస్తున్నారని, ఈ స్కాంపై టీడీపీని ప్రశ్నించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోట్ ఫైళ్లపై చంద్రబాబు నాయుడు స్వయంగా 13 సార్లు సంతకాలు చేసి నిధులు విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. అవసరమైన ఆధారాలతో పట్టుకున్నందుకే మాజీ సీఎంను అరెస్ట్ చేశామన్నారు. ఇప్పటికైనా ఆయన నోరు విప్పి సీఐడీ(CID) అధికారులకు వాస్తవాలు వెల్లడించాలని సూచించారు. రూ.371 కోట్ల కుంభకోణంలో అరెస్టయినప్పటి నుంచి తమ పార్టీ అధినేత అరెస్టుపై టీడీపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారని నాగేశ్వరరావు విమర్శించారు. ప్రజా ధనాన్ని దోచుకున్నారనే ఆరోపణలపై చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ నేతలు ‘సేవ్ డెమోక్రసీ’ నినాదాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చకు టీడీపీ(TDP) నేతలు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అదే సమయంలో అరెస్ట్‌ను అక్రమంగా అభివర్ణిస్తూ బయట ‘తప్పుడు ప్రచారం’ చేస్తు సానుభూతి చూపిస్తున్నారని పేర్కొన్నారు. 14 ఏళ్ల సీఎంగా చంద్రబాబు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో లాబీయిస్ట్ మనోజ్ వాసుదేవ్ పార్దసాని దుబాయ్ పారిపోయాడని, నాయుడు ప్రైవేట్ సెక్రటరీ పి శ్రీనివాస్‌ను అకస్మాత్తుగా అమెరికాకు ఎందుకు పంపారని ఆయన ప్రశ్నించారు. నాయుడు అరెస్ట్‌ను అనుకూలంగా మలచుకుని టీడీపీని తమ అధీనంలోకి తెచ్చుకోవాలని లోకేష్, ఆయన మామగారు ప్రయత్నిస్తున్నారని మంత్రి అన్నారు. ఈ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మౌనం వహించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్న రామకృష్ణుడికి చంద్రబాబు అక్రమాలు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.