Hijras: రైళ్లలో హిజ్రాలు (Hijras) వస్తుంటారు.. నగదు వసూల్ చేసి వెళుతుంటారు. జంక్షన్ వద్ద ట్రైన్ ఆగితే చాలు అంతే.. రైలు స్వీపర్ క్లాస్లో వెళ్లే కొందరు భయపడుతుంటారు. సిటీలలో కూడా షాప్స్ వద్ద, ఇతర చోట్ల దోపిడీ చేస్తుంటారు. అనంతపురం జిల్లాలో.. పట్టపగలే.. దారి గుండా వెళ్లేవారిని బెదిరించి డబ్బులు వసూల్ చేస్తున్నారు. ఇక వ్యాపారులు కనిపించినా అంతే సంగతులు. డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు.. లేదంటే వారి వస్తువులను తీసుకుంటున్నారు.
కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే దారిలో హిజ్రాలు కాపు కాస్తున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద వెహికిల్స్ స్లో అవుతాయి.. సో.. అక్కడ ఉంటున్నారు. టూ వీలర్ నుంచి వచ్చే వారిని డబ్బులు అడుగుతున్నారు. ఓ పది, ఇరవై అయితే ఫర్లేదు.. వేలకు వేలు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. కనీసం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూల్ చేస్తున్నారు. దీంతో జనం పోలీసులకు విషయం చెప్పారు.
చిరు వ్యాపారులను కూడా వదలడం లేదు. డబ్బులు లేవని చెబితే వారి వస్తువులను తీసుకుంటున్నారు. ఓ వ్యాపారి నుంచి చీరలను లాగేసిశారని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద ఉన్న హిజ్రాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇస్తామని చెబుతున్నారు.