సత్యసాయి: కొడికొండ చెక్పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి లారీ నడుపుతున్న అజిత్ పాల్ అనే వ్యక్తి పట్టుబడ్డారు. సీఐ జనార్ధన్ బృందం నిందితుడిని హిందూపురం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 10,000 రూపాయల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.