E.G: రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం గ్రామంలో పర్యటిస్తూ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య గురించి తెలుసుకుని పరిష్కారం చూపించారు. రాబోయే వేసవి కాలంలో విద్యుత్ కోతలు లేకుండా 24/7 విద్యుత్ అందించేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.