కృష్ణా: గుడివాడలో వెనిగండ్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో గవర్నమెంట్ హాస్పిటల్ టీమ్, బాపూజీ నగర్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బాపూజీ నగర్ స్టార్స్ జట్టు విజయం సాధించింది. విజేతలకు జనసేన ఇంఛార్జ్ శ్రీకాంత్ కప్‌ను అందజేశారు.